తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయం తరఫున ప్రతిరోజూ అన్నప్రసాదం

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో యాదాద్రి ఆలయం తరఫున అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. లాక్​ డౌన్​ ముగిసేంత వరకు అన్న ప్రసాదం అందిస్తామని ఆలయాధికారి తెలిపారు.

By

Published : Apr 9, 2020, 4:58 PM IST

యాదాద్రి ఆలయం తరఫున ప్రతి రోజు అన్న ప్రసాద వితరణ
యాదాద్రి ఆలయం తరఫున ప్రతి రోజు అన్న ప్రసాద వితరణ

యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి ఆలయం తరఫున ప్రతి రోజు దాదాపు 100 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు ప్రారంభించారు. పేద ప్రజలు ఆహారానికి ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. లాక్ డౌన్ ముగిసే వరకు యాదాద్రి కొండ కింద వాహన పూజల ప్రాంగణం సహా స్థానిక గోశాలలో అన్న ప్రసాద పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు, పేదలకు, అనాధలకు, ఆకలి తీర్చడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details