కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో తెరాస ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్, ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబానికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా ప్రతి గ్రామంలో దాతలు ముందుకు రావాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడం గొప్ప విషయం అని మహేందర్ రెడ్డి అన్నారు.
తెరాస ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు సరకుల పంపిణీ - DISTRIBUTION OF ESSENTIAL INGREDIENTS BY TRS IN YADADHRI BHUVANAGIRI DISTRICT
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిధిలో తెరాస ఆధ్వర్యంలో కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. సుమారు 1000 కుటుంబాలకు టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్, ఇంటింటికి వెళ్లి సరకులు అందించారు.
ఇంటింటికి వెళ్లి సరకులు అందించిన టెస్కాబ్ వైస్ ఛైర్మన్
లాక్ డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సందర్భంలో తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదన్నారు. ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించాలని కోరారు.
TAGGED:
tescab wise chairmen