తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలి' - వంగపల్లిలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు యాదాద్రి జిల్లా వంగపల్లిలో తెరాస ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేదలను ఆదుకోవటానికి దాతలు ముందుకు రావాలని సూచించారు.

Distribution of Essential Commodities to the Poor under TRS Party
'పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలి'

By

Published : Apr 21, 2020, 12:07 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో తెరాస ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్, టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు అందించారు.

ప్రతి గ్రామంలో దాతలు ముందుకొచ్చి ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా సూచించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో మే ఏడో తేదీ వరకు లాక్​డౌన్​ పొడగించినందుకు ప్రజలందరూ ఇళ్లలోనుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details