యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో కల్యాణ లక్ష్మీ షాపింగ్ మాల్ యాజమాన్యం నిత్యావసరాలు పంపిణీ చేసింది. బియ్యం, పప్పు, నూనె, కారం, చింతపండు, సబ్బులు వంటి 13 రకాల వస్తువులతో కూడిన కిట్లను వితరణ చేశారు. వీటిని తెలంగాణ ఆయిల్ఫెడ్ చైర్మైన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అందించారు. విపత్తు సమయాల్లో దాతలు ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోత్కరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ సావిత్రి , ఎస్సై హరిప్రసాద్ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మీ ఔదార్యం... పేదలకు నిత్యావసరాల పంపిణీ - distribution-of-essential-commodities-to-poor-yadadri
కల్యాణ లక్ష్మీ షాపింగ్‌మాల్ యాజమాన్యం ఔదార్యం చాటుకుంది. కరోనా వేళ పేదలకు అండగా నిలుస్తోంది.
![కల్యాణ లక్ష్మీ ఔదార్యం... పేదలకు నిత్యావసరాల పంపిణీ distribution-of-essential-commodities-to-poor-yadadri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6585901-789-6585901-1585487564826.jpg)
నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ