యాదాద్రి జిల్లా రాజపేటలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ సౌజన్యంతో గైల్ కంపెనీ సుమారు లక్ష రూపాయల విలువైన సామగ్రిని అందజేశారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, స్టాండ్, స్ట్రేచర్, వీల్ చైర్లను ఆసుపత్రికి పంపిణీ చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్, రాష్ట్ర సహకార బ్యాంకు వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పీహెచ్సీ ఆవరణలో మొక్కలు నాటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగుల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.