గంధమల్ల రిజర్వాయర్‌ను రద్దు చేస్తే.. భువనగిరి ప్రాంతానికి నీళ్లు ఎలా వస్తాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కో-ఆపరేటివ్ బ్యాంక్ రైతు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. ప్రజా సమస్యలే ముఖ్యమని ఎంపీ స్పష్టం చేశారు.
'గంధమల్లకు నీళ్లు వస్తే.. కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తా' - పదవులు ముఖ్యం కాదు.. ప్రజా సమస్యలే ముఖ్యం: ఎంపీ కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లాలో కో-ఆపరేటివ్ బ్యాంక్ రైతు రుణాల చెక్కులను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నదాతలకు పంపిణీ చేశారు. గంధమల్ల రిజర్వాయర్‌ను రద్దు చేస్తే.. భువనగిరి ప్రాంతానికి నీళ్లు ఎలా వస్తాయని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఒక వేళ నీళ్లు వస్తే కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానన్నారు.
కేంద్రం రూ.20 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తే... ఒక్కరైతుకు రూపాయ కూడా అందలేదని ఆరోపించారు. గంధమల్ల ప్రాజెక్టు పనులు రద్దు చేశాక.. బస్వాపురం ద్వారా నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఒక వేళ నీళ్లు వస్తే సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ వైస్‌ఛైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ అమరావతి, సింగిల్ విండో ఛైర్మన్ లింగాల బిక్షం, బ్యాంకు సిబ్బందితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా