కరోనా విపత్కర పరిస్థితుల్లో పలువురు దాతలు వివిధ రూపాల్లో సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరులోని ఆర్ట్ ఆఫ్ లీవింగ్ సంస్థ సభ్యులు.. స్థానిక శ్రీ లక్ష్మి మోటార్ షాపు యజమాన్యంతో కలిసి లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆయుర్వేద మందులను(Ayurvedic medicine) అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు.
Ayurvedic medicine: పోలీసులకు ఆయుర్వేద మందుల పంపిణీ - పోలీసులకు ఆయుర్వేద మందులు
కొవిడ్ సంక్షోభంలో.. విధి నిర్వహణలో అహర్నిశలు కృషి చేస్తోన్న పోలీసు సిబ్బందికి పలువురు అండగా నిలుస్తున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరులోని ఆర్ట్ ఆఫ్ లీవింగ్ సంస్థ సభ్యులు.. పోలీసులకు ఇమ్యూనిటీని పెంచే ఆయుర్వేద మందులను(Ayurvedic medicine) పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
Distribution of Ayurvedic medicines
ఆయుర్వేద మందులు శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయే తప్ప ఎలాంటి చెడు ప్రభావాలు చూపవని సంస్థ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, నిర్వాహకులు మంగేష్, గణేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Murder : తల్లీకూతుళ్ల దారుణ హత్య.. అల్లుడే హంతకుడు!