యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని ఓ ప్రైవేటు కంపెనీలో ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీలో తోట హేమంత్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. మెటీరియల్ క్రింది నుంచి పైకి లిఫ్టులో తీసుకెళ్తుండగా మధ్యలో లిఫ్టులో ఇరుక్కుని మరణించాడు.
లిఫ్టులో ఇరుక్కుని మరణించాడు.. అసలేం జరిగింది? - ఓ ప్రైవేటు కంపెనీలో లిఫ్టు ప్రమాదం
ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే కార్మికుడు లిఫ్టులో ఇరుక్కుని మరణించాడు. విధుల్లో భాగంగా మెటీరియల్ క్రింది నుంచి పైకి లిఫ్టులో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కంపెనీ సిబ్బంది చెబుతున్నారు. మృతుని తండ్రి కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు మరణించాడని అంటున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
లిఫ్టులో ఇరుక్కుని మరణించాడు.. అసలేం జరిగింది?
కంపెనీ నిర్లక్ష్యం వల్లనే తన కొడుకు మృతి చెందాడని, గతంలో కూడా కంపెనీలో హేమంత్‌కు గాయాలయ్యాయని మృతుని తండ్రి ఆరోపించారు. కంపెనీ ఇంఛార్జ్ మాత్రం లిఫ్టు పనిచేయడం లేదని, అయినా ఎందుకు లిఫ్టు వద్దకు వెళ్లాడో తెలియడం లేదని చెబుతున్నారు.
ఇదీ చూడండి :ఐసోలేషన్‌లో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి