మలి విడత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లాలో గొల్లకుర్మలు నిరసనకు దిగారు. భువనగిరిలోని సమీకృత నూతన కలెక్టరేట్ ఎదుట గొర్రెలను తీసుకొచ్చి ధర్నా నిర్వహించారు.
మలి విడత గొర్రెల పంపిణీ చేపట్టాలంటూ రహదారి దిగ్బంధం - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట గొర్రెల కాపర్లు గొర్రెలతో నిరసన చేపట్టారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు.
![మలి విడత గొర్రెల పంపిణీ చేపట్టాలంటూ రహదారి దిగ్బంధం dharna with sheeps on hyderabad warangal highway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9148929-720-9148929-1602504951859.jpg)
మలి విడత గొర్రెల పంపిణీ చేపట్టాలంటూ రహదారి దిగ్బంధం
హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించడంతో ఆ మార్గంతో పాటు యాదాద్రికి రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి నిరసనకారులను అక్కణ్నుంచి తరలించారు.
ఇదీ చదవండి:కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీలో ముగిసిన వాదనలు