తెలంగాణ

telangana

ETV Bharat / state

'ధరణి పోర్టల్​ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి' - వలిగొండలో ధరణి పోర్టల్​ తాజా వార్త

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఇకపై తహసీల్దార్ కార్యాలయంలోనే జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​ అనితారామచంద్రన్​ తెలిపారు. వలిగొండ ఎమ్మార్వో ఆఫీస్​లో ధరణి పోర్టల్​ను ప్రారంభించారు.

dharani portal opened at valigonda mro office in yadadri bhuvanagiri district
'ధరణి పోర్టల్​ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'

By

Published : Nov 2, 2020, 5:16 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ధరణి పోర్టల్​ను ప్రారంభించారు. మొదటి రోజు ఇద్దరు వ్యక్తులు తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఇక నుంచి అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లోనే జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా సులువుగా అమ్మకందారులు, కొనుగోలుదారులు ఎమ్మార్వో ఆఫీసులో భూముల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. భూమిని కొత్తగా కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్​తో పాటు వెంటనే మ్యూటేషన్ కూడా జరుగుతుందని తెలిపారు.

ఇదీ చూడండి:ఎల్​ఆర్​ఎస్​: రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల 59వేల 562 దరఖాస్తులు

ABOUT THE AUTHOR

...view details