రోజురోజుకూ విజృంభిస్తున్న మహమ్మారి కరోనా నియంత్రణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట క్షేత్రంలో ధన్వంతరి హోమం, సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు. వైరస్ బారిన పడకుండా సకల జనులను కాపాడాలంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
యాదాద్రిలో కరోనా నియంత్రణ కోసం పూజలు - dhanvanthari_homam and sudarshana homam at yadadri temple
ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ధన్వంతరి హోమం, సుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు నిర్వహించారు.
యాదాద్రిలో కరోనా నియంత్రణ కోసం పూజలు
సుమారు రెండు గంటలపాటు ఆలయ అర్చకులు, వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య వైభవోపేతంగా హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో గీతారెడ్డితో పాటు ఆలయ కమిటీ అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు
TAGGED:
యాదాద్రిలో ధన్వంతరి హోమం