రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు వేకువజామునే అర్చకులు బాలాలయంలోని మండపంలో ఆండాళ్ అమ్మవారిని వివిధ పుష్పాలతో అలంకరించి, తిరుప్పావై దివ్యప్రబంధ వేద మంత్ర పారాయణాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదాద్రిలో ఘనంగా ధనుర్మాసోత్సవాలు - యాదాద్రిలో ప్రత్యేక పూజలు
యాదాద్రి పుణ్య క్షేత్రంలో నేటి వేకువజాము నుంచే ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు తిరుప్పావై దివ్యప్రబంధ వేద మంత్ర పారాయణాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదాద్రిలో ఘనంగా ధనుర్మాసోత్సవాలు
జనవరి 14న ముగియనున్న ఈ వేడుకల్లో భాగంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన .. లక్ష్మీ సమేతుడైన నారసింహుడు ఉత్తరద్వారం గుండాభక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి:కూర్మ అవతారంలో భద్రాద్రి రామయ్య