యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం కావటం వల్ల కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి యాదాద్రికి తరలివచ్చి లక్ష్మీనరసింహుని దర్శించుకుని తరించారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు, తలనీలాలు సమర్పించే చోటు, సత్య నారాయణ వ్రత పూజల వద్ద ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం వరకు పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా లఘు దర్శనం కల్పించారు. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి - Devotes
భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తజన సందోహంగా మారింది. ఇవాళ సెలవురోజు కావటం వల్ల భక్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి ధర్మదర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది.
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి