తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదగిరీశుని దర్శనానికి తప్పని తిప్పలు - యాదాద్రి పునర్నిర్మాణ పనుల వల్ల ఇబ్బంది పడుతున్న భక్తులు

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో సౌకర్యాలు లేక సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. కనీస సౌకర్యాల్లో లోటు కనిపిస్తున్నందున చంటి పిల్లల తల్లులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

యాదాద్రి పునర్నిర్మాణ పనుల వల్ల ఇబ్బంది పడుతున్న భక్తులు

By

Published : Oct 20, 2019, 8:06 PM IST

యాదాద్రి పునర్నిర్మాణ పనుల వల్ల ఇబ్బంది పడుతున్న భక్తులు

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వారంతంలో పెరిగే రద్దీకి తగ్గట్టుగా కనీస సౌకర్యాలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

పాతవి తొలగించారు.. ప్రత్యామ్నాయం మరిచారు..

ఆలయ పునర్ నిర్మాణం పనుల్లో భాగంగా.. కొండపైన ఉన్న వసతి గృహం, ప్రసాద తయారీ కేంద్రం, భక్తులకు అందించే అన్న ప్రసాద వితరణ కేంద్రం, ఇతర కార్యాలయాల పాత భవనాలను తొలగించారు. వాటికి ప్రత్యామ్నాయం చూపలేదు.

పుణ్యస్నానం చేసేందుకు సరైన దారులే లేవు..

పుష్కరిణి వద్ద పనులు జరుగుతున్నందున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి తాత్కాలికంగా నల్లాలు ఏర్పాటు చేశారు. వాటిని చేరుకునేందుకు సరైన దారిలేక భక్తులు అవస్థలు పడుతున్నారు.

'దారికి అడ్డంగా ఉంటే కళ్యాణకట్టకు ఎలా వెళ్తాం..?'

స్నానపు గదులు, బట్టలు మార్చుకునే గదులు తక్కువ ఉన్నందున చాలా ఇబ్బందిపడుతున్నామని భక్తులు వాపోతున్నారు. కల్యాణకట్టకు వెళ్లే మార్గంలో సరైన సూచిక బోర్డులు లేవని.. పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తొలగించిన రాళ్లు, ఇనుప కడ్డీలు దారికి అడ్డంగా ఉన్నందున నడిచేందుకు ఇబ్బందిపడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు వెంటనే స్పందించి తగిన సౌకర్యాలు చేపట్టి భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండిః ప్లాస్టిక్​ను పారదోలకుంటే... భవిష్యత్తు అంధకారమే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details