ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సెలవుదినం కావడం వల్ల స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవడానికి అధికారులు లఘు దర్శనం ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొన్నారు.
భక్తి పారవశ్యం... యాదాద్రిలో జన సందోహం - telangana varthalu
యాదాద్రి లక్ష్మీనరసింహుని సన్నిధికి భక్తులు పోటెత్తారు. సెలవురోజు కావడం వల్ల యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.
భక్తి పారవశ్యం... యాదాద్రిలో జన సందోహం
స్వామివారి ధర్మదర్శనానికి 2గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది. మరోవైపు ఆలయ ఆభివృద్ది పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. వాహనాలకు అనుమతి లేకపోవడం వల్ల భక్తులు కాలినడకన కొండపైకి వెళ్తున్నారు.
ఇదీ చదవండి: పాతవే కానీ.. కొత్తగా రోడ్డెక్కుతున్నాయి!