Devotees Rush In Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. రద్దీ కొనసాగుతుండటంతో స్వామి వారి ధర్మదర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. దర్శన వరుసలు, ప్రసాద కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ఆలయంలో భక్తుల ఆరాధనలు, దైవదర్శనాలతో సందడి నెలకొంది. ఆస్థానపరంగా స్వయంభువులకు నిత్యారాధనలు జరిగాయి.
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. ధర్మదర్శనానికి 2 గంటల సమయం - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
Devotees Rush In Yadadri: ఆదివారం కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి ధర్మదర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. స్వామి వారికి నిర్వహించే నిత్య పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తుల రద్దీ