ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి ఇద్దరు అన్నాతమ్ముళ్లు కిలో బరువు ఉన్న బంగారు ప్రమిదలను కానుకగా అందజేశారు. హైదరాబాద్కు చెందిన సోదరులు కాముని గణేశ్, కాముని మల్లేశ్లు వారి తండ్రి 100వ జన్మదినం సందర్భంగా స్వామివారికి ఈ కానుకను అందజేసినట్లు తెలిపారు.
Yadadri temple: లక్ష్మీ నరసింహ స్వామికి కానుకగా బంగారు ప్రమిదలు - yadadri laxminarasimha swamy latest news
తమ తండ్రి 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇద్దరు అన్నాతమ్ముళ్లు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి విలువైన కానుకను అందజేశారు. దాదాపు కిలో బరువున్న బంగారు ప్రమిదలను ఆలయ ఈఓ గీతారెడ్డికి అందించారు.
లక్ష్మీ నరసింహ స్వామికి కిలో బంగారంతో ప్రమిదలు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి అఖండ ద్వీపం వెలిగించేందుకు రూ.53 లక్షలు విలువ చేసే బంగారు ప్రమిదలు, వాటిని పెట్టేందుకు రూ.50 వేల విలువ చేసే వెండి స్టాండ్లను ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు.
ఇదీ చూడండి:పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?