తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: నారసింహుని క్షేత్రంలో తగ్గిన రద్దీ - తెలంగాణ వార్తలు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నారసింహుని సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. వారాంతంలో సందడిగా ఉండే ఆలయ పరిసరాలు నేడు వెలవెలబోతున్నాయి. స్వామివారి నిత్యకల్యాణం, నారసింహ హోమంలోనూ భక్తుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది.

devotees flow decreased at lakshmi narasimha swamy temple,  lakshmi narasimha swamy temple latest news
యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ, శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం

By

Published : May 9, 2021, 2:43 PM IST

వారాంతంలో భక్తులతో కిటకిటలాడే యాదాద్రి క్షేత్రంలో కరోనా కారణంగా భక్తుల రద్దీ తగ్గింది. రోజూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం వల్ల నిరంతరం సందడిగా ఉండే ఆలయ పరిసరాలు... నిర్మానుష్యంగా మారాయి. స్వామివారి దర్శన, లడ్డూ ప్రసాద క్యూలైన్లు భక్తులు లేక బోసిపోయాయి.

బాలాలయంలో రోజూ నిర్వహించే స్వామివారి నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమంలో పాల్గొనే భక్తుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు యాదగిరిగుట్టలో స్వచ్ఛంద లాక్​డౌన్ అమలులో ఉంది.

ఇదీ చదవండి:నీ అనురాగానికి వెలలేదు .... నీ ప్రేమకు హద్దులేదు..!

ABOUT THE AUTHOR

...view details