ఆలయ పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం యాదాద్రిలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా పోలీసుల మయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పోలీసులు ఆంక్షలు ఉండడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు.
పోలీసుల ఆంక్షలు... భక్తులకు తప్పని తిప్పలు - భక్తుల ఇబ్బందుల వార్తలు
సీఎం యాదాద్రి పర్యటనలో భాగంగా పోలీసులు విధించిన ఆంక్షలకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఓవైపు కరోనా... మరోవైపు పోలీసుల నిబంధనలతో... చిన్నపిల్లలు, వృద్ధులు వికలాంగులు నానా అవస్థలు పడ్డారు.
పోలీసుల ఆంక్షలు... భక్తులకు తప్పని తిప్పలు
ఆదివారం సెలవురోజు కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. ఓ వైపు కరోనా... మరో వైపు పోలీసుల ఆంక్షలతో భక్తులు చాలా ఇబ్బందులకు గుర్యయ్యారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు నానా అవస్థలు పడ్డారు. ఇష్ట దేవుడిని దర్శించుకునేందుకు వచ్చిన వారికి తిప్పలు తప్పలేదు. సీఎం పర్యటన అనంతరం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు.
ఇదీ చూడండి:ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం... తొందరపాటు వద్దు: కేసీఆర్