Devotees problems in Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కష్టాలు తప్పడం లేదు. ప్రధానాలయం ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా.. భక్తులకు సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. యాదాద్రికి వచ్చే భక్తుల పుణ్యస్నానాల కోసం కొండ కింద తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట ఎదురుగా లక్ష్మీపుష్కరిణి ఏర్పాటుచేశారు. ఆలయ ప్రారంభానికి ముందురోజు కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి ప్రారంభించారు.
యాదాద్రిలో భక్తుల అవస్థలు.. లక్ష్మీ పుష్కరిణిలో నీళ్లు లేక ఇక్కట్లు - యాదాద్రిలో భక్తుల అవస్థలు
Devotees problems in Yadadri: యాదాద్రీశుని సన్నిధిలో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న తమకు కనీసం తాగు నీటి సౌకర్యం కూడా లేదని ఇప్పటికే భక్తులు గగ్గోలు పెట్టిన సంగతి విదితమే. మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని మండిపడుతున్నారు. అంతే కాకుండా రెండ్రోజులుగా లక్ష్మీ పుష్కరిణిలో నీళ్లు లేకపోవడంతో.. పుణ్యస్నానాలు చేయాలనుకునే భక్తులు నిరాశ చెందుతున్నారు.
రెండ్రోజులుగా లక్ష్మీపుష్కరిణిలో నీళ్లులేక పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ పుష్కరిణికి సమీపాన ఏర్పాటు చేసిన బాత్రూంల్లోనే స్నానాలు చేసి.. స్వామి వారి దర్శనానికి వెళ్తున్నారు. దీంతో పుణ్య స్నానాలు చేయాలనే ఆశతో వెళ్లిన భక్తులు నిరాశకు లోనవుతున్నారు. లక్ష్మీపుష్కరిణిని శుద్ధిచేస్తున్నందున భక్తులను అక్కడకు అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:TRS Protest in Delhi: ధాన్యం కొనుగోళ్లపై దిల్లీలో తెరాస పోరాటం..