తెలంగాణ

telangana

ETV Bharat / state

'హిందువుల మనోభావాలు దెబ్బతినేలా యాదాద్రి పనులు' - Hindu communities are objecting yadadri constructions

యాదాద్రి పుణ్యక్షేత్ర కనుమ దారిని ఆధ్యాత్మిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. సుమారు 2 కిలో మీటర్లు రెండు వరసలుగా నిర్మిస్తున్న ఈ దారి పిల్లర్లపై శంఖు,చక్ర,నామాలు చిత్రించడం అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందు సంఘాలు అందోళన చేస్తున్నాయి.

Devotees along with Hindu communities are objecting yadadri constructions
'హిందూ మనోభావాలు దెబ్బతిసేలా ఉన్నాయి'

By

Published : Dec 30, 2020, 10:08 PM IST

యాదాద్రిలో నిర్మించే మూడవ కనుమ రహదారి పిల్లర్లపై శంఖు, చక్ర, నామాలు తొలగించాలని .. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నాయకులు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అవి హిందూ మనోభావాలు దెబ్బతిసేలా ఉన్నాయని .. వాటిని తొలగించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.

అభ్యంతరం వ్యక్తం

కొండపై దైవాదర్శనాలయ్యాక భక్తులు పైనుంచి కిందికి చేరే దారికోసం ప్రస్తుతం 19 సిమెంట్ పిల్లర్లకు ఆర్​అండ్​బీ శాఖ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. యాదాద్రి పైకి నిర్మించే మూడవ కనుమ రహదారి పిల్లర్లకు శంఖు,చక్ర,నామాలు చిత్రిస్తున్నారు. ఘాట్ రోడ్డు ప్రారంభించాక నామాలపై నుంచి వాహనాలు, కాలినడకన వెళ్లే భక్తులు ఉంటారని అందువల్ల.. స్వామి వారి నామాలను తొక్కినట్లు భావించవలసి వస్తుందని హిందు సంఘాలతో పాటు.. పలువురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:'నియామక పత్రాలు ఇవ్వకుంటే... టీఎస్​పీఎస్సీని ముట్టడిస్తాం'

ABOUT THE AUTHOR

...view details