యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో దీపావళి పర్వదినం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు యథావిధిగా పూజలు నిర్వహించిన అర్చకులు.. సాయంకాలం ఆరాధన అనంతరం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం స్వామి వారికి అమ్మవారికి మహాలక్ష్మీ ఆరాధన నిర్వహించారు.
నరసింహ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు - యాదాద్రి లేటెస్ట్ వార్తలు
దీపావళి పర్వదినం సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు తరలొచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
నరసింహ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు
వివిధ రకాల పుష్పాలు, పైసలతో అమ్మవారిని అలంకరించి మంగళ హారతులు, నైవేద్యాలు సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. అనంతరం ఆలయంలో దీపారాధన చేశారు ఆలయ అర్చకులు, అధికారులు. ఈ పూజల్లో ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆలయ ఛైర్మన్ నర్సింహామూర్తి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:దీపకాంతుల నడుమ కళకళలాడిన పల్లెలు, పట్టణాలు