తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వే ట్రాక్​పై మృతదేహం - యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి తాజా వార్తలు

రాయగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం ట్రాక్​పై పడి ఉంది. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Dead body on rayagiri railway track
రైల్వే ట్రాక్​పై మృతదేహం

By

Published : May 25, 2020, 5:34 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం నెలకొంది. రాయగిరి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్​పై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బస్వాపురం గ్రామానికి చెందిన అన్నం పట్ల వంశీగా పోలీసులు గుర్తించారు.

వంశీ వృత్తి రీత్యా కారు డ్రైవర్. ఈరోజు తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :ఓయూలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

ABOUT THE AUTHOR

...view details