తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన డీసీఎం.. వ్యక్తి మృతి - GOUS NAGAR

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ బైక్​ని ఢీ కొట్టాడు. ఘటనలో ద్విచక్ర వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పాక శ్రీశైలం

By

Published : Jun 13, 2019, 5:58 PM IST

బైక్​ని డీసీఎం ఢీ కొనటం వల్ల ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కపూర్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. మృతుడు గౌస్​నగర్​కు చెందిన పాక శ్రీశైలంగా గుర్తించారు. భువనగిరి నుంచి గౌస్​నగర్​కు బైక్​పై బయలుదేరిన పాక శ్రీశైలం తుక్కపూర్ వద్దకు చేరుకోగానే గ్లాస్ ఫ్యాక్టరీకి చెందిన డీసీఎం భువనగిరి వైపు వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
ఘటనతో పాక శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. బాధితుని తరపున గ్రామస్తులు, బంధువులు ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details