యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరుకు చెందిన బాలయ్య.. భువనగిరి పట్టణ శివారులో ఎకరా 5 కుంటల భూమిని 2011లో కొనుక్కున్నాడు. తన భూమిని కబ్జా చేసి చంపుతానని బృందావన్ డెవలపర్స్‌కు చెందిన మన్నెపల్లి మురళీకృష్ణ బెదిరిస్తున్నారని.. అతన్ని అరెస్ట్ చేయాలని బాలయ్య వేడుకున్నారు.
'తమ భూములు ఆక్రమించాలనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి' - భువనగిరి బృందావన్ డెవలపర్స్ వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వ్యక్తి పేరున పట్టా ఉన్న భూమిని బృందావన్ డెవలపర్స్‌కు చెందిన మన్నెపల్లి మురళీకృష్ణ ఆక్రమించాలని కుట్ర చేస్తున్నారంటూ.. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా సబ్‌కలెక్టర్‌కు దళిత ఐక్య వేదిక సభ్యులు వినతిపత్రం అందజేశారు.

'తమ భూములు ఆక్రమించాలనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి'
బాలయ్యకు న్యాయం చేయాలని కోరుతూ భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మేరకు అతనిపై చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ ఉపేందర్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. బాధితుని ఫిర్యాదు మేరకు మురళీకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ భుజంగరావు వెల్లడించారు.
ఇవీచూడండి:ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్