యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎస్‌కు ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు.
దర్శనానంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎస్ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొండ పైగల హరిత టూరిజంలో స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు.