Devotees Crowd at Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సెలవు రోజు కావడంతో దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 2 గంటల సమయం - yadadri temple laest nes
Devotees Crowd at Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సెలవు రోజు కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
![యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 2 గంటల సమయం Crowd of devotees at Yadadri Sri Lakshmi Narasimha Swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17610577-208-17610577-1674974765149.jpg)
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ
లడ్డూ ప్రసాదం కౌంటర్లు, నిత్య కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. లక్ష్మీ నరసింహ నామస్మరణతో యాదగిరి గుట్ట ప్రతిధ్వనిస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. పార్కింగ్ స్థలంలో రద్ధీ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: