యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మండల పరిధిలోని పెద్ద కందుకూరు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి గ్రామాభివృద్ధికి ఆటంకంగా మారారని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన - యాదగిరిగుట్టలో సీపీఎం నిరసన ర్యాలీ
యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద కందుకూరు పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ మేరకు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని నిరసన
అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డకున్నారు. దీంతో కార్యాలయం ముందు ధర్నా చేశారు. నాయకుల విజ్ఞప్తి మేరకు గేటు వద్దకు వచ్చి ఎంపీడీవో వినతిపత్రం స్వీకరించారు.
ఇదీ చూడండి:తెదేపా రాష్ట్ర కమిటీ నియామకం.. మళ్లీ రమణకే బాధ్యతలు