రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రీన్ జోన్‌గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయని, జిల్లా పరిధిలోని బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వైద్య పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం ముందు వారు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఎం ధర్నా! - కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి
కరోనా నుంచి ప్రజలను కాపాడాలని, కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రి ముందు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాల మీద దృష్టి పెట్టాలని కోరారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఎం ధర్నా!
జిల్లాలోని మండల కేంద్రాలతో పాటు మున్సిపల్ కేంద్రాలలో కరోనా చికిత్సకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని, ప్రైవేటు ఆస్పత్రులలో ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేష్, భట్టుపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు.