తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​.. ఎన్​ఆర్​సీపై మౌనమెందుకు: రాఘవులు - raghavulu speaks on cm kcr

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన  తెరాస.. ఎన్​ఆర్​సీపై ఎందుకు మౌనంగా ఉందో సీఎం కేసీఆర్​ సమాధానం చెప్పాలని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్​ చేశారు.

cpm raghavulu
కేసీఆర్​.. ఎన్​ఆర్​సీపై మౌనమెందుకు: రాఘవులు

By

Published : Dec 26, 2019, 7:35 PM IST

ఎన్​ఆర్​సీ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్​ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్​లో ఆరెస్సెస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ చేసిన వ్యాఖ్యలపై రాఘవులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైందవ సంస్కృతిని అనుసరించేవారే దేశంలో ఉండాలనే వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. లౌకిక దేశంలో ఒక మతం కింద మరో మతం వారు ఉండాలంటే కష్టమని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నా.. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన తెరాస.. ఎన్​ఆర్​సీపై ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. లౌకిక శక్తులకు కలుపుకొని ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​పై పోరాటం చేస్తామని రాఘవులు ప్రకటించారు.

కేసీఆర్​.. ఎన్​ఆర్​సీపై మౌనమెందుకు : రాఘవులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details