చిట్యాల - భువనగిరి రహదారి మరమ్మతులు చేయాలని.. భువవగిరి మండలం అనాజిపురం స్టేజి వద్ద సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ మార్గంలో భారీ వాహనాలు వెళ్తుండటంతో .. రోడ్లు పూర్తిగా దెబ్బతిని వాహనదారులు తరచు ప్రమాదాలకు గురవుతున్నారు.
"రహదారి మరమ్మతుల కోసం ఆందోళన" - bhuivangiri latest news
చిట్యాల - భువనగిరి రహదారి మరమ్మతులు చేయాలని అనాజిపురం స్టేజి వద్ద సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. రహదారులకు మరమ్మతులు చేయని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
"రోడ్డుపై బైఠాయించి ఆందోళన ఉద్ధృతం చేస్తాం"
ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టని పక్షంలో.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.