భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఎం సీనియర్ నాయకులు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే రాజయ్య కరోనాతో మృతి చెందడం బాధాకరమని... ఆయన మృతి పార్టీకి తీరని లోటని నాయకులు గుర్తు చేసుకున్నారు.
సున్నం రాజయ్య మృతి పట్ల సీపీఎం నేతల సంతాపం - మోత్కూర్ లో సున్నం రాజయ్యకు నివాళులు
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సున్నం రాజయ్య మృతి పట్ల సీపీఎం నేతల సంతాపం
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనకంటూ సొంత ఇల్లు.. వాహనం కూడా లేదని నిస్వార్థంతో ప్రజా సేవ చేసిన నాయకుడని కొనియాడారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా అంగరక్షకులు లేకుండా సైకిల్ మీద తిరుగుతూ.. ప్రజల కోసం పని చేశారన్నారు. కూలీలు, రైతులు, పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడన్నారు.