యాదగిరిగుట్టలో "హరేరామ హరికృష్ణ" ఆశ్రమాన్ని కూల్చడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యాదాద్రి జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. ఎవరు లేని సమయంలో ఆశ్రమాన్ని కూల్చడం దారుణమన్నారు. కూల్చిన ఆశ్రమాన్ని తిరిగే అదే స్థలంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులకు తెలియకుండా ఆశ్రమం కూల్చడం ఎంత వరకు సమంజసం అని విమర్శించారు. వైటీడీఏ కు సంబంధించిన భూమిని చినజీయర్ స్వామికి కట్టబెట్టిన వారు ఇతరుల చెందిన ఆశ్రమాన్ని రోడ్డుకు అడ్డంగా ఉందన్న కారణంతో కూల్చడం ఏంటని ప్రశ్నించారు.
'ఆశ్రమ కూల్చివేత హేయమైన చర్య' - 'ఆశ్రమ కూల్చివేత హేయమైన చర్య'
మంగళవారం ఉదయం యాదాద్రిలో హరేరామ హరికృష్ణ ఆశ్రమాన్ని ప్రభుత్వం కూల్చడంపై జిల్లా సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారంటూ మండిపడ్డారు.

'ఆశ్రమ కూల్చివేత హేయమైన చర్య'