తెలంగాణ

telangana

ETV Bharat / state

మోత్కూరులో సీపీఐ సర్వ సభ్య సమావేశం

సీపీఐ సర్వసభ్య సమావేశం మోత్కూరులో జరిగింది. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి గోదా రాములు పాల్గొని శ్రేణులకు సూచనలు చేశారు.

సర్వ సభ్య సమావేశం

By

Published : Mar 30, 2019, 7:34 PM IST

సమావేశంలో పాల్గొన్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో సీపీఐ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వామపక్షాలు బలపరిచిన భువనగిరి లోక్​సభ అభ్యర్థి గోదా రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రజల కోసం పనిచేసే పార్టీ

ప్రజల కోసం నిరంతరం పనిచేసే పార్టీ సీపీఐ అని గోదా రాములు అన్నారు. ఏప్రిల్​ 11న జరిగే ఎన్నికల్లో కచ్చితమైన నిర్ణయాన్ని ప్రజలు వెలువరిస్తారని తెలిపారు. భవిష్యత్​ ఎన్నికల్లో సీపీఐ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :కేసీఆర్​ ఆలోచనలు దేశానికే ఆచరణీయమయ్యాయి

ABOUT THE AUTHOR

...view details