తెలంగాణ

telangana

ETV Bharat / state

పాపాల విముక్తి కోసమే.. యాగాలు: నారాయణ - narayana fires on cm kcr

దేవాలయాల అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్​ అవినీతికి పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ నెల 8న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు కేసీఆర్​ నాయకత్వం వహించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

పాపాల విముక్తి కోసమే.. యాగాలు: నారాయణ
పాపాల విముక్తి కోసమే.. యాగాలు: నారాయణ

By

Published : Jan 1, 2020, 9:00 PM IST

ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతుండటం బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. యూదగిరిగుట్టలో పర్యటించిన నారాయణ... దేవాలయాల అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్నాడని విమర్శించాడు. ఇప్పటికే ఎన్నో పాపాలు చేసిన కేసీఆర్​... విముక్తి కోసం యాగాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్​ తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను నీర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నారన్నారు. పార్లమెంటులో ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ఓటేసిన తెరాస... ఈ నెల 8న జరిగే దేశవ్యాప్త సమ్మెకు నాయకత్వం వహించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

పాపాల విముక్తి కోసమే.. యాగాలు: నారాయణ

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 3148 డ్రంక్​ అండ్ డ్రైవ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details