తెలంగాణ

telangana

ETV Bharat / state

24 గంటల్లో కేసును ఛేదిస్తాం: సీపీ మహేశ్​ భగవత్​ - శ్రావణి హత్య కేసు

యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో ఆందోళన చేస్తున్న శ్రావణి కుటుంబ సభ్యులను సీపీ మహేశ్​ భగవత్​ పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీనిచ్చారు.

సీపీ మహేశ్​ భగవత్​

By

Published : Apr 27, 2019, 5:32 PM IST

యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రావణి మృతదేహంతో ఆమె బంధువులు గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తే తప్ప అంత్యక్రియలు జరపమని భీష్మించుకు కూర్చున్నారు. బంధువుల ఆందోళనతో సీపీ మహేశ్​ భగవత్​ బొమ్మల రామారం చేరుకున్నారు. 24 గంటలల్లో నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైతే ఎస్సైను సస్పెండ్​ చేస్తామని తెలిపారు. సీపీ హామీతో శ్రావణి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

సీపీ హామీతో ఆందోళన విరమించిన శ్రావణి కుటుంబ సభ్యులు

ABOUT THE AUTHOR

...view details