రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జోన్లో కొత్తగా నియామకమైన 194 మంది కానిస్టేబుళ్లకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ మహేశ్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లందరికీ సీపీ శుభాకాంక్షలు తెలిపారు.
నూతనంగా నియామకమైన కానిస్టేబుళ్లు తమ పని విధానం ద్వారా రాచకొండ కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలని సీపీ సూచించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణ ఎలా ఉండాలి, ఏం చేయాలి తదితర అంశాలను వారికి వివరించారు. పోలీసులకు క్రమశిక్షణ ముఖ్యమని తెలిపారు.