యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని సుమారు 150 మంది గర్బిణీలకు, ఆశా వర్కర్లకు గ్రామ పంచాయతీ సిబ్బందికి రామకృష్ణ మఠం వారి సౌజన్యంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆహార పొట్లాలను అందజేశారు. కరోనా మహమ్మారి గర్భిణీలకు, పిల్లలకు, వృద్ధులకు త్వరగా సోకే అవకాశం ఉన్నందున ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వృద్ధులు, గర్భిణులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి: సీపీ మహేశ్ భగవత్
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని సుమారు 150 మంది గర్భిణీలకు సీపీ మహేశ్ భగవత్ ఆహార పొట్లాలను అందజేశారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గర్భిణీలకు ఆహార పొట్లాలు అందజేసిన సీపీ మహేశ్ భగవత్
ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు దాటి బయటకు రాకూడదని... తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. రామకృష్ణ మఠం వారు నిరుపేద ప్రజలకు పౌష్టికాహారాన్ని అందిచాలనే ఉద్దేశంతోనే ఆహార పొట్లాలను అందజేసినట్లు వివరించారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు బయట ఎవ్వరూ తిరగకుండా పోలీసులకు సహకరించాలని మహేష్ భగవత్ కోరారు.