యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సందర్శించారు. ప్రభుత్వం చేపట్టిన లాక్ డౌన్ నేపథ్యంలో టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు, స్నాక్స్ అందచేసి పలు సూచనలు చేశారు.
ప్రజలు అకారణంగా బయటకు రావొద్దు: సీపీ మహేశ్ భగవత్ - సీపీ మహేశ్ భగవత్ న్యూస్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులకు శానిటైజర్లు, స్నాక్స్ అందజేశారు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్. ప్రజలంతా లాక్ డౌన్‌కు సహకరించాలని ఆయన కోరారు.
cp
గూడ్స్ వాహనాలు ఓఆర్ఆర్ ద్వారా హైదరాబాద్‌లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 లోపు అన్‌లోడింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు మాత్రం అకారణంగా బయటకు రావొద్దని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 3,500 కేసులు నమోదు చేశామని ప్రజలంతా లాక్ డౌన్‌కు సహకరించాలని ఆయన కోరారు.