తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు - యాదాద్రి వైకాపా తాజా వార్తలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. కొండకింద వైకుంఠ ద్వారం వద్ద కేక్ కట్ చేశారు.

cp-cm-jagan-birthday-celebration-at-lakshmi-narasimha-swamy-temple-in-yadadri-bhuvanagiri
యాదాద్రిలో ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు

By

Published : Dec 22, 2020, 7:00 AM IST

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్టలోని వైకుంఠ ద్వారం వద్ద కేక్ కట్ చేసి... పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. నారసింహుని ఆలయంలో జగన్ పేరుతో అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించామని యాదాద్రి భువనగిరి వైకాపా అధ్యక్షుడు వడ్లోజు.వెంకటేశ్ తెలిపారు.

ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా... దేశంలోనే మెరుగైన పాలన చేస్తున్నారని కొనియాడారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.

ఇదీ చదవండి:కరోనా వైరస్ స్ట్రెయిన్​తో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details