నవ దంపతుల బలవన్మరణం.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం - భువనగిరిలో ఆత్మహత్య

12:11 February 18
నవ దంపతుల బలవన్మరణం.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
భువనగిరిలో ఓ హోటల్‌లో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగులమందు తాగి బలవన్మరణానికి ఒడిగట్టారు. భర్త స్వామి మృతి చెందాడు. భార్య ఉమ పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరూ వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి వాసులు.
మూడురోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. స్వామి, ఉమ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి బంధువులు పెళ్లికి నిరాకరించడంతో పారిపోయి వివాహం చేసుకున్నారు. యువతి బంధువులే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి: