యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో కరోనాతో చనిపోయిన ఓ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ఓ కౌన్సిలర్. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆపత్కాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.
కరోనా మృతదేహానికి అంత్యక్రియలు జరిపిన కౌన్సిలర్ - కరోనా మృతదేహానికి దహన సంస్కారాలు
కరోనాతో మృతి చెందిన ఓ మహిళ మృతదేహానికి స్థానిక కౌన్సిలర్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో జరిగింది.
covid death
9వ వార్డులో చిక్క రాధమ్మ (53) కరోనా బారినపడి గత రాత్రి కన్నుముశారు. వైరస్ భయంతో స్థానికులెవరూ ముందుకు రాకపోవడంతో.. కౌన్సిలర్ అనిల్ అంత్యక్రియలు జరిపించారు. పీపీఈ కిట్ ధరించి జేసీబీ సాయంతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఇదీ చదవండి:రుయా ఆసుపత్రి వార్డుల ఎదుట మృతుల బంధువుల ఆర్తనాదాలు