రైతులు ముందుగా పత్తి కొనుగోలు కేంద్రాలకు వచ్చి తమ పేరు, ఎన్ని క్వింటాళ్ల పత్తి అమ్ముతున్నారో వంటి వివరాలు నమోదు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా పత్తి కొనుగోలు అధికారి రవీంద్ర అన్నారు. మోత్కూరు మండల పరిధిలోని శ్రీ మహాలక్ష్మి, నటరాజ్, సాయిశ్రీనివాస, గాయత్రి కాటన్ పరిశ్రమలను మార్కెట్ కార్యదర్శి అలీంతో కలిసి సందర్శించారు.
నాణ్యమైన పత్తికే గిట్టుబాటు ధర : పత్తి కొనుగోలు అధికారి
నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలని యాదాద్రి భువనగిరి జిల్లా పత్తి కొనుగోలు అధికారి రవీంద్ర అన్నారు. మోత్కూరు మండల పరిధిలోని పలు కేంద్రాలను సందర్శించారు.
నాణ్యమైన పత్తికే గిట్టుబాటు ధర
రైతులు నాణ్యమైన పత్తిని కేంద్రాలకు తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలని రవీంద్ర సూచించారు. గుడ్డిపత్తి, తడిసి రంగు మారిన పత్తిని నాణ్యమైన పత్తితో కలిపితే గిట్టుబాట ధర రాదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు, సిబ్బంది, అధికారులు కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు.