యాదాద్రిలో యాత్రికుల బస చేయడానికి ప్రత్యేక కాటేజీల నిర్మాణం చేపడుతున్నారు. వీటికి సంబంధించిన నమూనాల తయారీకి యాడా అధికారులు కసరత్తులు ప్రారంభించారు. సంప్రదాయం, అధునాతన హంగులతో నిర్మాణాలు చేపట్టాలని తలచిన యాడా దిల్లీకి చెందిన ఆర్కాబ్ ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ సంస్థకు నమూనాల తయారీ బాధ్యతలను అప్పగించింది.
యాదాద్రిలో కాటేజీల నిర్మాణానికి కసరత్తు - yadadri laxminarasimha swamy temple
యాదాద్రి పుణ్యక్షేత్రంలో యాత్రికుల బస కోసం ప్రత్యేక కాటేజీల నిర్మాణానికి సంబంధించిన నమూనాల తయారీకి కసరత్తు మొదలైంది.
యాదాద్రిలో కాటేజీల నిర్మాణానికి కసరత్తు
క్షేత్రాభివృద్ధిలో భాగంగా తొమ్మిది వందల (900) ఎకరాల్లో పెద్ద గుట్ట పై ఆలయ నగరి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. 250, ఎకరాల్లో లేఅవుట్ పనులు పూర్తి చేసి కాటేజీల ఏర్పాటుకు వనరులు కల్పించారు. ఆలయ నగరిలో నాలుగు రకాల కాటేజీల నిర్మాణ పనులు ఆరంభించినట్లు యాడా పేర్కొంది.
- ఇవీచూడండి: పురపోరుకు ములుగు ఎందుకు దూరమైంది..?