యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీటి సంధ్య, జడ్పీటీసీ గోరుపల్లి శలద, మున్సిపాలిటీ ఛైర్మన్ తీపిరెడ్డి సావిత్రి పాల్గొన్నారు.
'28 రోజుల తరువాత రెండో టీకా తీసుకోవాలి' - telangana news
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. 73 మంది ఆరోగ్య సిబ్బందికి ఈరోజు వ్యాక్సినేషన్ వేశామని వైద్యులు తెలిపారు. 28 రోజుల తరువాత రెండో టీకా తీసుకోవాలని సూచించారు.
'28 రోజుల తరువాత రెండవ టీకా తీసుకోవాలి'
73 మంది ఆరోగ్య సిబ్బందికి ఈరోజు వ్యాక్సినేషన్ వేయనున్నట్లు డాక్టర్ కిషోర్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ రిజర్వేషన్, వ్యాక్సినేషన్, పర్యవేక్షణ అని మూడు భాగాలుగా ఉంటుందని అన్నారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు తలెత్తితె 108 వాహనం అందుబాటులో ఉందని తెలిపారు. డోసు తీసుకున్న 28 రోజుల తరువాత రెండో టీకా తీసుకోవాలని సూచించారు. మొదటి టీకా డాక్టర్ కిషోర్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధలు, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
TAGGED:
telangana news