కరోనా వ్యాక్సిన్ స్టాక్ లేకపోవడంతో యాదాద్రి జిల్లాలోని పలు పీహెచ్సీలలో 'నో స్టాక్' బోర్డులు ఏర్పాటు చేశారు. కొవిన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకున్న వారంతా ఆ బోర్డులు చూసి నిరాశతో వెనుదిరిగారు.
జిల్లాలో కరోనా వ్యాక్సిన్ 'నో స్టాక్' బోర్డులు - covid vaccine shortage
కరోనా రెండో దశ నేపథ్యంలో.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో టీకా కొరత ఏర్పడుతోంది. యాదాద్రి జిల్లాలోని పలు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించడంతో అప్పటివరకు ఎదురు చూసిన ప్రజలు.. నిరాశతో వెనుదిరిగారు.
యాదగిరిగుట్ట, బొమ్మల రామారం, మోట కొండూరు మండల కేంద్రాల్లోని పీహెచ్సీల గేట్లకు 'నో కరోనా వ్యాక్సిన్', 'ఈ రోజు వ్యాక్సిన్ వేయబడదు' అని బోర్డులు పెట్టారు. తుర్కపల్లి కేంద్రంలో 20 మందికి సరిపడా వ్యాక్సిన్ ఉన్నా.. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నవారు దాదాపుగా 100 మంది రావడంతో ఎవరికీ టీకా వేయలేదు. కొందరికి వేసి మరికొందరికి వేయకపోతే గొడవ జరిగే అవకాశమున్నందున ఆ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:ఆక్సిజన్, రెమ్డెసివర్, టీకా డోసులను ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి