ముంబయి నుంచి స్వగ్రామాలకు తిరిగి వస్తున్న వలస కార్మికుల్లో కరోనా లక్షణాలు బయట పడుతుండడం, యాదాద్రి భువనగిరి జిలాల్లో కలకలం రేపుతోంది. తాజాగా జిల్లాలోని మోటకొండూరు మండల కేంద్రానికి ముంబయి నుంచి వచ్చిన ఏడుగురు వలస కార్మికుల్లో ఒక మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా వీరిని ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఫీవర్ ఆస్పత్రికి క్వారంటైన్ కోసం పంపించారు. వారికి అక్కడ కరోనా పరీక్ష చేయగా మహిళకు పాజిటివ్ అని తేలిందని మండల వైద్యాధికారి రాజేందర్ నాయక్ తెలిపారు.
ముంబయి నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ - corona virus update news
యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ముంబయి నుంచి వచ్చిన మోటకొండూరు మండల కేంద్రానికి వచ్చిన ఏడుగురు వలస కార్మికుల్లో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై వారిని క్వారంటైన్ కోసం ఫీవర్ ఆస్పత్రికి పంపించారు.
అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన మోటకొండూరు వాసికి సంబంధించిన ఏడుగురు కుటుంబ సభ్యులను బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ నరసింహ రెడ్డి, ఎస్ఐ వెంకన్న, మండల వైద్యాధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో బాధితుల ఇళ్లకు వెళ్లి తగు జాగ్రత్తలు సూచించారు. బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వలస కూలీలు వచ్చిన ఇంటి ప్రదేశాలలో, సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. వారు వచ్చిన ఆటోను కూడా శానిటైజ్ చేశారు. ప్రజలకు తగు జాగ్రత్తలు సూచించారు.
ఇవీ చూడండి:'కార్మికుల్ని అలా చూసి మనసు చలించిపోయింది'