యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రోజూ 25 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి ప్రకాశ్ వెల్లడించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఒక రోజు ముందు రోగి పేరు, ఆధార్ కార్డు, సెల్ నెంబర్‌తో ఆసుపత్రిలో రిజిస్టర్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
యాదాద్రి దవాఖానాలో కరోనా ర్యాపిడ్ టెస్టులు షురూ
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కరోనా ర్యాపిడ్ టెస్టులు నేటి నుంచి ప్రారంభమైయ్యాయి. వ్యాధి లక్షణాలున్న వ్యక్తులకు రోజుకు 25మందికి ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు దవాఖానా సూపరింటెండెంట్ రవిప్రకాశ్ తెలిపారు.
రోగిని పరీక్షించిన అనంతరం మరుసటి రోజు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుండు 2 గంటల వరకు ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితం కూడా వెంటనే చెబుతామన్నారు. రోగికి పాజిటివ్ అని తేలితే, వ్యాధి లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటే హోమ్ ఐసోలేషన్ చేస్తామని, రోగికి వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటే బీబీనగర్ ఎయిమ్స్ లేదా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తామన్నారు.
ఇవీ చూడండి:మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు