తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి భువనగిరి జిల్లాలో పడగవిప్పిన కరోనా

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరులో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా మూడు పాజిటివ్ కేసులు నిర్థరణ అయ్యాయి. ఫలితంగా మండల పరిధిలో భయాందోళన వాతావరణం నెలకొంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో పడగవిప్పిన కరోనా
యాదాద్రి భువనగిరి జిల్లాలో పడగవిప్పిన కరోనా

By

Published : May 10, 2020, 9:33 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఆత్మకూరు మండలంలో ఏకంగా మూడు కరోనా పాజిటివ్ కేసుల నమోదుతో మండల వాసులు భయాందోళనలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని ఆనందంగా ఉన్న తరుణంలో గత మూడు రోజుల క్రితం 14 మంది ముంబయి నుంచి ఆత్మకూరుకు తరలివచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు లక్షణాలు ఉన్న నలుగురిని కరోనా పరీక్షలకు పంపారు.

ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్...

అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి పాజిటివ్ నిర్థరణ అయ్యిందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అప్రమత్తమైన అధికారులు బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని వెతికి హోం క్వారంటైన్ చేశారు. మిగిలిన వారిలో ఐదుగురిని హైదరాబాద్​లోని క్వారంటైన్​కు తరలించారు. గ్రామాన్ని హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేయించారు. గ్రామమంతా బ్లీచింగ్ వెదజల్లారు. గ్రామంలోకి ఇతరులెవరూ రాకుండా రహదారులకు అడ్డంగా ముళ్ల కంపను వేశారు. క్వారంటైన్​కు తరలించిన వారితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారనే విషయంపై అధికారులు ఆరాతీస్తున్నారు.

ఇవీ చూడండి : దేశంలో ఒక్కరోజే మరో 128 కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details