యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 38 ఏళ్ల మహిళ కొంతకాలంగా గుండె సంబంధిత జబ్బుతో బాధ పడుతోంది. వైద్య చికిత్స కోసం మే 28న సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల 30వ తేదీన ఆమెకు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులు రావడం వల్ల.. ఈ నెల 2న కరోనా పరీక్షలు చేసి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. వెంటనే ఆమెను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హోం క్వారంటైన్లో బంధువులు